ఆలయం తొలగింపుపై ఫిలింనగర్‌లో ఉద్రిక్తత

ఆలయం తొలగింపుపై ఫిలింనగర్‌లో ఉద్రిక్తత

హైదరాబాద్ లోని  ఫిలింనగర్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హనుమాన్ ఆలయం తొలగింపుపై హిందూ సంఘాల కార్యకర్తలు నిరసనకు దిగారు. ఆలయం వద్దకు చేరుకుని దర్శనానికి అనుమతించాలంటూ డిమాండ్ చేశారు. పోలీసులను నెట్టేసి దూసుకెళ్లారు. దీంతో పోలీసులకు హిందూ సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసుల ముందే ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆ యువకుడితో పాటు 150 మంది హిందూ సంఘాల కార్యకర్తలను అరెస్ట్ చేశారు పోలీసులు.