
దొంగలిద్దరూ ఏదో విషయంలో గొడవపడ్డారు. ఆ కోపంలో ఓ దొంగ.. మరో దొంగ గొంతుకోసి చంపాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్‌లో జరిగింది. రాజు, ఫిరోజు అనే ఇద్దరు దొంగలు శుక్రవారం అర్థరాత్రి 12 గంటల సమయంలో గొడవ పడ్డారు. దాంతో మార్కెట్ పక్కనే ఉన్న చైతన్య పురి పోలీస్ స్టేషన్‌లో ఇద్దరూ ఒకరి మీద మరోకరు ఫిర్యాదు చేసుకున్నారు. రాజు తనను చంపుతానని బెదిరిస్తున్నట్లు ఫిరోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు ఇద్దరినీ మందలించి వదిలిపెట్టారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాత్రి మూడు గంటల సమయంలో మార్కెట్‌లో మరోసారి గొడవపడ్డారు. తీవ్ర కోపోద్రిక్తుడైన ఫిరోజ్.. రాజు గొంతుకోసి చంపాడు. మార్కెట్‌లోని వ్యాపారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
For More News..
రాష్ట్ర బీజేపీ నాయకుడిపై దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
డిప్యూటీ మినిష్టర్‌గా పిల్లి.. ఎందుకో తెలుసా?
నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ ట్రయల్స్