తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ లొల్లి

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ లొల్లి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతల మధ్య లొల్లి మరింత ముదిరింది. ఆదివారం జరిగిన ‘లాయస్టుల ఫోరం మీటింగ్’కు పీసీసీ చీఫ్ రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ఇచ్చిన కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఈ వ్యవహారం ఢిల్లీకి చేరింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి కేటాయించిన బాధ్యతల నుంచి తొలగిస్తూ రేవంత్ సోమవారం నిర్ణయం తీసుకోవడంతో సీనియర్లంతా అలర్ట్ అయ్యారు. ఈ విషయంపై ఏదో ఒకటి తేల్చుకోవాలని హైకమాండ్ అపాయింట్​మెంట్​ కోరినట్లు తెలిసింది. ఓబీసీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాల్సి ఉందని వీహెచ్ సోమవారమే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మంగళవారం ఉదయం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా వెళ్తున్నట్లు తెలిపారు. ఎంపీలు ఉత్తమ్​కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ప్రస్తుతం హస్తినలోనే ఉన్నారు. సీనియర్ నేతలు వారితో సంప్రదింపులు జరపడం, హైకమాండ్ సానుకూలంగా స్పందించడంతో కొందరు నేతలను ఢిల్లీకి పిలిపించారని, సోనియా గాంధీ ఆపాయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ఇచ్చారని సమాచారం.

సీఎల్పీకి వస్త.. అంతా చెప్త: జగ్గారెడ్డి
ఆదివారం జరిగిన లాయస్టుల ఫోరం మీటింగ్ చుట్టూ హైడ్రామానే నడించింది. మీటింగ్ పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కొందరు నేతలు రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా స్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రచ్చ ఇంకా సద్దుమణగక ముందే రేవంత్ తీసుకున్న నిర్ణయం సీనియర్లను షాక్​కు గురి చేసింది. తనకు కేటాయించిన బాధ్యతల నుంచి తొలగించడంపై జగ్గారెడ్డి స్పందించారు. ఫోన్​లో తనకు సమాచారం అందిందని, మంగళవారం సీఎల్పీకి వచ్చి తన అభిప్రాయం చెప్తానని తెలిపారు. తనకు, పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందో వివరిస్తానన్నారు. గతంలో పీసీసీలోని ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు రేవంత్ రెడ్డి వివిధ బాధ్యతలు అప్పజెప్పారు. ఈ క్రమంలో జగ్గారెడ్డికి కూడా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు, అనుబంధ సంఘాల బాధ్యతలు కేటాయించారు. తాజాగా వీటిని రద్దు చేశారు. ఇతర వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఆ బాధ్యతలను అప్పజెప్పారు. జగ్గారెడ్డికి ఎలాంటి బాధ్యతలు కేటాయించకుండా మీడియాకు నోట్ రిలీజ్ చేశారు.

హద్దు మీరితే హైకమాండ్ ఊరుకోదు: మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్
పార్టీని నష్టపరిచే కార్యక్రమాలు ఎవరు చేసినా హైకమాండ్ సహించబోదని వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. గాంధీభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైకమాండ్ నియమించిన పీసీసీ అధ్యక్షున్ని అందరూ గౌరవించాల్సిందేనన్నారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజాస్వామ్యం ఉంటుందని ఎవరైనా హద్దు మీరితే అధిష్టానం ఊరుకోదని హెచ్చరించారు. వ్యక్తిగత సమస్యలుంటే అంతర్గతంగా చర్చించకుండా మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావును వీహెచ్ ఎందుకు కలిశారో ఏఐసీసీ పరిశీలిస్తోందని చెప్పారు. కాగా, జగ్గారెడ్డికి వర్క్ కేటాయించింది రేవంత్ కాబట్టి.. తొలగింపు నిర్ణయం కూడా ఆయన సొంతంగా తీసుకున్నదే అయి ఉంటుందని, హైకమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈ విషయం తెలియకపోవచ్చని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. తాము సోనియాను కలిసినపుడు ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలపై ఫిర్యాదు చేస్తామని తెలిపారు.