
నాగర్‌కర్నూల్, వెలుగు: కొల్లాపూర్నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మొదలైన గొడవలు కొట్లాటకు దారితీశాయి. మొలచింతలపల్లి గ్రామంలోని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గాలు రెండు రోజులుగా పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. దానికి ఇసుక తరలింపు వివాదం తోడైంది. దీంతో ఆదివారం రాత్రి రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. ఘర్షణలో సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాసులు కారు ధ్వంసం అయ్యింది. గాయపడిన వారిని స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీస్‌పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాలకు చెందిన లీడర్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.