టీయూ క్యాంపస్ కాలేజీలకు నేటి నుంచి హాలీడేస్​

టీయూ క్యాంపస్ కాలేజీలకు నేటి నుంచి హాలీడేస్​
  • హాస్టళ్లలో రిపేర్లు చేసేందుకు 9వరకు సెలవులు ప్రకటించిన వీసీ
  • ఉద్యమాలు ఆపేందుకేనని స్టూడెంట్​ సంఘాల ఫైర్​

డిచ్​పల్లి, వెలుగు : తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ తో పాటు, భిక్నూర్ సౌత్​క్యాంపస్, సారంగాపూర్ ఎడ్యుకేషనల్ క్యాంపస్ కు 1వ తేదీ నుంచి సెలవులు ప్రకటిస్తున్నట్లు వీసీ రవీందర్ గుప్తా బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హాస్టళ్లలో రిపేర్లు చేయాల్సి ఉన్నందున 9వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. క్లాసులు ఆన్ లైన్ లో జరుగుతాయని చెప్పారు. 

ఉద్యమాలు ఆపేందుకే..

యూనివర్సిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని ఆపేందుకే వీసీ సెలవులు ప్రకటించారని స్టూడెంట్ లీడర్లు సంతోష్​, శివ బుధవారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో రిపేర్లు చేయాలని గతంలో ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకుండా ఇప్పుడు రిపేర్లంటూ సెలవులు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హాస్టల్స్ ఖాళీ చేసేది లేదని, సెలవులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.