టీచర్లు, ఉద్యోగుల స్పౌజ్ అలాట్​మెంట్లలో గందరగోళం

టీచర్లు, ఉద్యోగుల స్పౌజ్ అలాట్​మెంట్లలో గందరగోళం
  • జోనల్, మల్టీజోనల్ పోస్టులు అలాట్ కాకముందే లిస్టులు

హైదరాబాద్, వెలుగు: టీచర్లు, ఎంప్లాయీస్ జిల్లాలు, జోన్లు అలాట్​మెంట్ గందరోగళంగా మారింది. స్పౌజ్ బదిలీల్లో ఆఫీసర్లకు సరైన ప్లాన్ లేకపోవడంతో ఉద్యోగులుగా ఉన్న భార్యాభర్తలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా డిపార్ట్​మెంట్లలో జోనల్, మల్టీజోనల్ పోస్టులను అలాట్ చేయకముందే, టీచర్లకు పోస్టింగ్​లు ఇచ్చేశారు. దీంతో స్పౌజ్ బదిలీల్లో వారికి అవకాశం లేకుండా పోయింది. భార్యాభార్తలిద్దరూ అప్లికేషన్స్ పెట్టుకుంటే, కనీసం వెరిఫై చేయకుండా ఇద్దరికీ వేర్వేరుగా అలాట్​మెంట్లు ఇచ్చారు. అధికారుల తప్పులకు టీచర్లు, ఎంప్లాయీస్ ఆందోళన చెందుతున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్​లో స్పౌజ్ బదిలీల కోసం 6వేల అప్లికేషన్లు రాగా, ఇతర అప్పీల్స్ మరో 8వేల వరకు వచ్చాయి. ఇప్పటికీ చాలా డిపార్ట్​మెంట్లలో జోన్లు, మల్టీజోన్ల అలాట్మెంట్ పూర్తి కాలేదు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్​మెంట్​లోనే హెడ్​మాస్టర్లకు గురువారం రాత్రి మల్టీజోన్లను అలాట్ చేశారు. ఇంకా జిల్లాలు అలాట్ కాలేదు. సూపరింటెండెంట్లకు జోన్లు అలాట్‌‌‌‌‌‌‌‌ చేసినా జిల్లాలకు కేటాయించలేదు. ఇంత గందరగోళంలో ఎంప్లాయీస్ స్పౌజ్​ట్రాన్స్​ఫర్​ కోసం ఎలా అప్లై చేసుకుంటారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.