ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్ లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మహేశ్కుమార్ గౌడ్ మాట్లాడుతూ గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ టికెట్స్ కేటాయించాలని సూచించారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన, చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాయన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ సత్తా చాటాలన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, బిజ్జు దత్తాద్రి, చెలిమెల శ్రీనివాస్, దాసరి సునీల్, అంబల్ల తిరుపతి, చిట్ల యజ్ఞేశ్, బండారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
