- బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెరబెల్లి
మంచిర్యాల, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్‌విచారణ పేరుతో కాంగ్రెస్, బీఆర్ఎస్నాయకులు డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వెరబెల్లి రఘునాథ్రావు విమర్శించారు. బుధవారం మంచిర్యాలలోని పార్టీ జిల్లా ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతిని బయటపెట్టి వారిని జైలుకు పంపుతామని చెప్పి రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఒక్కరిని కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.
రెండు పార్టీల నడుమ చీకటి ఒప్పందంతోనే బీఆర్ఎస్ నాయకులను వెనకేసుకొస్తున్నారని ఆరోపించారు. సింగరేణి బొగ్గు బ్లాక్‌ల కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టి బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న దోపిడీని ప్రజలు గమనిస్తున్నారని, వారికి సరైన సమయంలో తగిన బుద్ధి చెపుతారని అన్నారు.
రూ.40 కోట్లతో రైల్వేస్టేషన్ అభివృద్ధి
కేంద్ర ప్రభుత్వం అమృత్‌భారత్ స్కీమ్‌లో మంచిర్యాల రైల్వేస్టేషన్‌ను రూ.30 కోట్లతో అభివృద్ధి చేస్తోందని, హమాలివాడ ఫుట్‌ఓవర్‌బ్రిడ్జి నిర్మాణానికి మరో రూ.10 కోట్లు సాంక్షన్ చేసిందని రఘునాథ్ తెలిపారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పార్టీ లీడర్లతో కలిసి బుధవారం పరిశీలించారు. ప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. త్వరలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంచిర్యాల రైల్వే స్టేషన్ పనుల పర్యవేక్షణకు రానున్నట్లు తెలిపారు. నాయకులు గాజుల ముఖేశ్‌గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, గోలి రాము, మున్నరాజ్సిసోడియా, ఎం.తిరుపతి, వి.వెంకటేశ్వర్ రావు, ఎ.కృష్ణమూర్తి, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
