నిజాంకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఉద్యమం చేశాయన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెప్టెంబర్ 17 విలీనం సందర్భంగా… గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట యోధులకు సన్మానం చేశారు. బీజేపీ చరిత్రను వక్రీకరిస్తుందన్న ఉత్తమ్…ఆంధ్ర వ్యక్తి రామ్ మాధవ్ కు తెలంగాణ చరిత్ర తెలియదన్నారు. హైదరాబాద్ విలీనం అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలన్నారు.

