దోపిడీ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందం : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

దోపిడీ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పందం : బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాండింగ్ రాజకీయాలతో ప్రజలను దగా చేస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భూ దోపిడీలో ఒకరికొకరు సహకరించుకుంటూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. 'మీరు పదేళ్లు దోచుకున్నారు.

మేము మూడేళ్లుగా దోచుకుంటున్నాం. ఇంకో రెండేళ్లూ దోచుకుంటాం. మీరు మమ్మల్ని ఏమనొద్దు, మేము మిమ్మల్ని ఏమీ అనం. రెండు పార్టీల మధ్య ఉన్న ఒప్పందం ఇదే' అని ఎద్దేవా చేశారు. మీడియాలో కనిపించేందుకు బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల గేట్ల ముందు కాంగ్రెస్ నేతలు పరేడ్లు చేయడం కేవలం ప్రజలను పక్కదోవ పట్టించే నాటకమన్నారు.