బీఆర్ఎస్ ను తరిమికొడదాం : కసిరెడ్డి నారాయణరెడ్డి

బీఆర్ఎస్ ను తరిమికొడదాం : కసిరెడ్డి నారాయణరెడ్డి

కల్వకుర్తి, వెలుగు: ఇచ్చిన హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తరిమికొడదామని  కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆయన వెల్దండ మండలంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు నోటిఫికేషన్లు వేసి పరీక్షలు పెట్టి,  పేపర్లు లీక్ చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆరు గ్యారంటీలను అమలుతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో నాగర్ కర్నూల్ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్,  నాయకులు పాల్గొన్నారు.