ఫేక్ సర్వేలను ప్రజలు నమ్మరు..జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: నవీన్ యాదవ్

ఫేక్ సర్వేలను ప్రజలు నమ్మరు..జూబ్లీహిల్స్ లో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ లో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ప్రతిపక్షాలు చేయించే ఫేక్ సర్వే లను ప్రజలు నమ్మరని..  గ్రౌండ్ లో కాంగ్రెస్ కి బలం ఉందని చెప్పారు. జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్సేనని తెలిపారు. మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో 150 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని తెలిపారు నవీన్.   నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులను చూసి  ప్రజలు  స్వచ్ఛందంగా కాంగ్రెస్ కి ఓటు వేస్తామంటున్నారని చెప్పారు.  

గత పదేళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు నవీన్ యాదవ్.  మూడు సార్లు అవకాశం ఇచ్చినా మాగంటి గోపినాథ్  నియోజకవర్గానికి చేసిందేమీ లేదన్నారు.  సీఎం రేవంత్  రోడ్ షో లకు మంచి స్పందన వస్తుందన్నారు. మైనార్టీలు అంతా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ కు  సపోర్ట్ చేస్తున్న ఎంఐఎంకు ధన్యవాదాలు  తెలిపారు నవీన్ యాదవ్.  తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు.  స్థానికుడిని కాబట్టి దగ్గరుండి ప్రజల సమస్యలు తీరుస్తానన్నారు.

జూబ్లీహిల్స్ లో ప్రధాన  పోటీ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మధ్యే ఉండనుంది.  సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్, జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ, సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ .. 14న కౌంటింగ్ జరగనుంది.