కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’ కు కొత్త కమిటీలు

కాంగ్రెస్ ‘చింతన్ శిబిర్’ కు కొత్త కమిటీలు

న్యూఢిల్లీ: వచ్చే నెల 13 నుంచి 15 వరకు ఉదయ్‌పూర్‌లో ‘చింతన్ శిబిర్’ అనే పేరుతో మూడు రోజుల పాటు మేధోమథనం కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో చర్చించే పలు అంశాలకు సంబంధించిన జాబితాను తయారు చేసేందుకు కొత్తగా 6 కమిటీలను పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. ప్రతి కమిటీకి ఓ కన్వీనర్ ను నియమించారు. ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ కమిటీకి భూపేందర్ సింగ్ హుడా, యూత్ అండ్ ఎంపవర్ మెంట్ కు అమరీందర్ సింగ్ వారింగ్, ఆర్గనైజేషన్ కమిటీకి ముకులు వాస్నిక్, సోషల్ జస్టీస్ అండ్ ఎంపవర్ మెంట్ కు సల్మాన్ ఖుర్షీద్, ఎకానమీ కమిటీకి పి.చిదంబరం, పొలిటికల్ కమిటీకి మల్లికార్జున ఖర్గే ను కన్వీనర్లుగా నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

మరిన్ని వార్తల కోసం:

శంషాబాద్ లో రూ. 21 కోట్ల డ్రగ్స్ పట్టివేత

ఆచార్య టికెట్ ధ‌రలు పెరిగినయ్..!