వరద సాయం రూ.50 వేలు.. మెట్రోలో ఉచిత ప్రయాణం

వరద సాయం రూ.50 వేలు.. మెట్రోలో ఉచిత ప్రయాణం

వరద బాధిత కుటుంబాలకు రూ.50 వేల ఆర్థిక సాయం అందిస్తామంది తెలంగాణ కాంగ్రెస్. జీహెచ్ఎంసీ మేనిఫెస్టో విడుదల చేసింది కాంగ్రెస్. ఈ సందర్బంగా అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. వరదలకు పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.5లక్షలిస్తామన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.2.5లక్షలు ఇస్తామన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్పిస్తామన్నారు. బస్తీ దవాఖానాలను 450 కి పెంచుతామన్నారు. పాతబస్తీ, ఎయిర్ పోర్టు వరకు ఎంఎంటీఎస్ మెట్రో విస్తరిస్తామన్నారు.  కేబుల్ ఆపరేటర్లకు పోల్ ఫీజు రద్దు చేస్తామన్నారు. సొంత జాగాలో ఇళ్లు కట్టుకునే వారికి రూ.8 లక్షలిస్తామన్నారు. ఇళ్లుండి అదనపు గది కట్టుకోవడానికి రూ.4లక్షలిస్తామన్నారు.

మహిళలు, వృద్ధులు,వికాలాంగులకు  మెట్రో,ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజులు నియంత్రిస్తామన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో వసతులు మెరుగుపరుస్తామన్నారు. లైబ్రరీ సెస్సును పూర్తిగా వినియోగిస్తామన్నారు. 80 గజాల లోపు ఇళ్లకు పూర్తిగా ఆస్తి పన్ను మాఫీ చేస్తామన్నారు. స్లమ్ డెవ్ లప్ మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామన్నారు. 30 వేల లీటర్ల మంచి నీరు ఉచితంగా ఇస్తామన్నారు.