కులగణన, రిజర్వేషన్లపై యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కులగణన, రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రాల వారీగా కాంగ్రెస్ పార్టీ సభలు నిర్వహించనుంది. ప్రతి బహిరంగసభలో లోక్ సభప్రతిపక్ష నేత రాహుల్ గాందీ పాల్గొననున్నరు.
సమావేశంలో హర్యానా, మహారాష్ట్ర, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, బిహార్, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు నేతలు. కుల గణన జరిగితే వెనుబడిన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతదంటోంది కాంగ్రెస్. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, జైరాం రమేశ్, కర్ణాటక పీసీసీ అధ్యక్షులు డీకే శివకుమార్, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షీ , ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
आज कांग्रेस अध्यक्ष श्री @kharge और नेता विपक्ष श्री @RahulGandhi की उपस्थिति में भारतीय राष्ट्रीय कांग्रेस के महासचिवों, प्रदेश प्रभारी और प्रदेश अध्यक्ष की महत्वपूर्ण बैठक हुई।
— Congress (@INCIndia) August 13, 2024
? AICC मुख्यालय, नई दिल्ली pic.twitter.com/62tyWcEoNt
