మహాకూటమిలో కాంగ్రెస్‌ లేనట్లే: కేజ్రీవాల్

మహాకూటమిలో కాంగ్రెస్‌ లేనట్లే: కేజ్రీవాల్

కాంగ్రెస్‌తో మహా కూటమి లేనట్లే అని ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీలో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కూటమి కడదామన్న తన ఒప్పందాన్ని కాంగ్రెస్‌ తిరస్కరించిందన్నారు కేజ్రీవాల్. కాంగ్రెస్‌,బీజేపీలు దేశ ఆర్దిక వ్యవస్థను నాశనం చేశాయన్నారు. అన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలను కాంగ్రెస్‌ బలహీనం చేస్తోందన్నారు. ఢిల్లీలో మాత్రం ఆమ్‌ ఆద్మీ పార్టీయే ఏడుకు ఏడు లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందని స్పష్టం చేశారు కేజ్రీవాల్.