ఏడేళ్లుగా ఏం వెలగబెట్టిర్రు.. విద్య, వైద్యం ఉపాధిలో ఫెయిల్

ఏడేళ్లుగా ఏం వెలగబెట్టిర్రు.. విద్య, వైద్యం ఉపాధిలో ఫెయిల్

ఏడేళ్లుగా ఉద్యోగాల భర్తీ చేయకపోవడానికి కారణాలు చెప్పాలన్నారు కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్. యూనివర్సిటీలో వీసీలు, అధ్యాపకుల పోస్టులు ఎందుకు నింపలేదని ప్రశ్నించారు. సర్కార్ చాతకాని తనానికి ఇది నిదర్శనమన్నారు. సింగరేణి నియామకాల్లో అవకతవకలు జరిగాయన్నారు. కనీసం TSPSCలో కూడా సరిపడా సిబ్బంది లేరని మండిపడ్డారు.  ఐటీఐఆర్ వస్తే తెలంగాణ దశ దిశా మారిపోతుందన్నారు. విద్య, వైద్యం ఉపాధిలో సర్కార్ ఫెయిల్ అయ్యిందన్నారు.

తెలంగాణలో స్కిల్ డెవలప్ మెంట్ చేయకపోవడం వల్ల చాలా నష్టపోయామన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. ఆ మహమ్మారిని నిర్మిలించాల్సిన అవసరం సర్కారుపై ఉందన్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు.. నోటిఫికేషన్ల కోసం వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారన్నారు. ఏ ముఖం పెట్టుకొని న్యాయవాదులతో  సమావేశం పెట్టారని.. వాళ్ళ కోసం ఏం చేశారని ప్రశ్నించారు.