కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్

కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఆయన తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవనున్నారు. ఎన్నికల్లో పోటీ అంశంపై చర్చించనున్నారు. ఇప్పటికే ఈ పోటీలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గెహ్లాట్ సీఎం పదవిని వదులుకోవడానికి ఇష్టపడడంలేదు. ఇవాళ ఆయన రాహుల్ గాంధీని కలిసి అధ్యక్ష పదవి చేపట్టాలని కోరనున్నారు. రాహుల్ మాత్రం అధ్యక్ష పదవిపై ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. 24 నుంచి 30వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 1న నామినేషన్ల పరిశీలన, 8 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 17న ఓటింగ్ జరగనుండగా..19న ఫలితాలను ప్రకటించనున్నారు. 

1998 తర్వాత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పీఠానికి ఎన్నికలు జరుగుతుండడం ఇదే మొదటిసారి. 1998లో జరిగిన ఎన్నికల్లో సీతారాం కేసరి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2000 నుంచి సోనియా గాంధీ పార్టీ చీఫ్ గా కొనసాగుతున్నారు. మధ్యలో రాహుల్ ఆ పదవిని చేపట్టినా..2019 ఎన్నికల తర్వాత ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన ఆ పదవికి రాజీనామా చేశారు.