
హైదరాబాద్: కరోనా కేసుల సంఖ్య తక్కువ చూపడానికే టెస్టులు చేయట్లేదన్నారు కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులతో తెలంగాణ ప్రభుత్వం లాలూచీ పడుతోందని ఆరోపించారు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ అరికట్టే జీవో అమలు కావట్లేదన్న జీవన్ రెడ్డి.. కరోనా, బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు.