లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైసలతో రైతుబంధు ఇస్తున్నడు: జానారెడ్డి

లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైసలతో రైతుబంధు ఇస్తున్నడు: జానారెడ్డి
  •     సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేత జానారెడ్డి ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     అధికారంలోకి వస్తే సాగుకు 24 గంటల కరెంట్ ఇస్తామని వెల్లడి
  •     వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని స్పష్టీకరణ

హాలియా, వెలుగు:  సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్ర ప్రజలతో ఏడాదికి రూ.40 వేల కోట్ల లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తాగిస్తూ, అవే పైసలతో రైతు బంధు, ఇతర స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఇస్తున్నారని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీనియర్ నేత జానారెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డబ్బు లేకుండా పోటీ చేయాలని తాను చేసిన సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వీకరించలేదని గుర్తుచేశారు. డబ్బు, లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంచి ఓట్లను కొని, ఉప ఎన్నికలో తనను ఓడించారన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా హాలియాలో జరిగిన ఆయన కుమారుడు కుందూరు జయవీర్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తానని జానారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తానని, ఈ క్రమంలోనే యువ నాయకత్వాన్ని అందించేందుకే తాను అసెంబ్లీ బరి నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తన చిన్న కుమారుడు కుందూరు జయవీర్ రెడ్డి పోటీ చేస్తారని, అతన్ని ఆశీర్వదించాలని జానారెడ్డి కోరారు. కాగా, తాము అధికారంలోకి వస్తే తప్పకుండా వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే, ఆరు గ్యారంటీలను కూడా కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. అనంతరం జానారెడ్డి సమక్షంలో సాగర్ నియోజకవర్గంలోని అనుముల, తిరుమలగిరి, సాగర్, పెద్దవూర, గుర్రంపోడు, నిడమనూరు, త్రిపురారం మండలాల పరిధిలోని వివిధ గ్రామాల చెందిన మాజీ ఎంపీపీలు, సర్పంచులు, ముఖ్య కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరారు. వారికి జానారెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు.