దేశానికి ఇందిర దుర్గామాతలా ..విజయం అందించారు : మహేశ్​ కుమార్ ​గౌడ్​

దేశానికి ఇందిర దుర్గామాతలా ..విజయం అందించారు : మహేశ్​ కుమార్ ​గౌడ్​
  • దేశానికి ఇందిర దుర్గామాతలా ..విజయం అందించారు
  • కాంగ్రెస్ నేత మహేశ్​ కుమార్ ​గౌడ్​

హైదరాబాద్, వెలుగు :  మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మన దేశానికి దుర్గామాతలా విజయం అందించారని పీసీసీ వర్కింగ్ ​ప్రెసిడెంట్​మహేశ్​కుమార్​ గౌడ్ అన్నారు. ఉక్కు సంకల్పంతో పాకిస్తాన్​ను ఓడించి బంగ్లాదేశ్​కు విముక్తి కల్పించారని గుర్తుచేశారు. ఆమె నిర్ణయాల వల్లే 1971 యుద్ధంలో  విజయం సాధించామన్నారు.శనివారం బంగ్లాదేశ్ ​లిబరేషన్​ వార్​1971 విజయోత్సవం సందర్భంగా గాంధీ భవన్​లోని ఇందిరా భవన్​లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లిబరేషన్​ వార్​ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. 

అనంతరం మహేశ్​కుమార్​ మాట్లాడుతూ.. ప్రపంచం అబ్బురపడేలా ఓ దుర్గామాతలాగా  దేశానికి  ఇందిరా గాంధీ విజయాన్ని అందించారన్నారు. పాకిస్తాన్​తో భారత సైన్యం పోరాడి విజయం సాధించిందని తెలిపారు. బంగ్లాదేశ్​ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని వెల్లడించారు.  ప్రపంచంలోనే అతి తక్కువ కాలం పాటు జరిగిన యుద్ధంలో  గెలిచి ప్రపంచానికి దేశ శక్తిని ఆర్మీ నిరూపించిందని గుర్తుచేశారు. అప్పటి చరిత్రను ఇప్పటి సమాజానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందన్నారు.