VRO లను అవినీతి పరులని.. MRO, RDO లను నీతిమంతుల్ని చేశారా?

VRO లను అవినీతి పరులని.. MRO, RDO లను నీతిమంతుల్ని చేశారా?

హైద‌రాబాద్: కేసీఆర్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కొత్త రెవెన్యూ బిల్లు అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కొత్త రెవిన్యూ చట్టానికి పాలాబీషేకాలు , క్షీరాభిషేకాలు టీఆర్ఎస్ పార్టీ నేతలు తప్ప ఏ ఒక్క రైతు చేయ‌ట్లేద‌ని ఎద్దేవా చేశారు. ధరణి పోర్టల్ ద్వారా రెవిన్యూ సమస్య పూర్తి గా పరిష్కారం కాదని.. ఫీల్డ్ సర్వే జరిగితేనే సమస్య పరిష్కారం అవుతుంద‌న్నారు. బిల్లు ను సెలెక్ట్ కమిటీ కి పంపకుండా ..బిల్లు ను ఆమోదించుకున్నారని ఆరోపించారు. కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా..సర్వే ఎందుకు చేయలేదని ప్ర‌శ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక…కేంద్ర ప్రభుత్వం ..రాష్ట్రంలో భూసర్వే చేసేందుకు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని.. దేశంలో అనేక రాష్ట్రాలు ఇప్పటికే భూ సర్వే చేశాయ‌న్నారు. తెలంగాణ లో మాత్రం చాలా ఆలస్యం గా ఈ కార్యక్రమం చేస్తున్నారన్నారు.

రెవెన్యూ అధికారులు బాగా పనిచేస్తున్నారని నెల జీతం బోనస్ ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా..? అని ప్ర‌శ్నించారు జీవ‌న్ రెడ్డి. అధికారం లేని వీఆర్వో లను అవినీతి పరులు అంటూ..ఎమ్మార్వో ,ఆర్డీవో లు నీతిమంతులు అని చెపుతున్నారని ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. ఫారెస్ట్ ,ఎండోమెంట్ ,వక్స్ భూముల కు ఆటో లాక్ ఎప్పటినుంచో ఉంద‌ని.. ఇప్పుడు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కొత్త గా ఆటో లాక్ చేసేదేమీ లేద‌ని అన్నారు. అసలు అంశాలు పక్కన పెట్టి.. తనకు తోచిన సమాధానం చెప్తున్నారని, ప్రజా అవసరాలు పక్కన పెట్టి..సంఖ్యా బలంతో బిల్లు లు పాస్ చేసుకుంటున్నారని అన్నారు. బిల్లులకు ఆమోదం తెలిపేముందు ప్రతి పక్షాలు.. ప్రజలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు.