సింపతితోనే సైదిరెడ్డి గెలిచిండు : పొన్నం

సింపతితోనే సైదిరెడ్డి గెలిచిండు : పొన్నం

హుజూర్ నగర్లో  సింపతితో  టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలిచారని అన్నారు కాంగ్రెెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్. సైదిరెడ్డి వరుసగా ఓడిపోవడం వల్లే జనం  ఆయనకు సింపతితో ఓట్లు వేశారని అన్నారు. టీఆర్ఎస్ గ్రామీణ ఓటర్లను భయపెట్టి ఓట్లు వేయించుకుందని అన్నారు. ఉప ఎన్నికకు టీఆర్ఎస్ రూ.30 నుంచి 40 కోట్లు ఖర్చుపెట్టిందనే ప్రచారం జరుగుతుందన్నారు. హుజూర్ నగర్లో తామంతా ఐక్యతతో కలిసి పనిచేశామన్నారు.  రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సేనని అన్నారు.  ఆర్టీసీ కార్మికులను తాము రెచ్చకొట్టలేదని.. అశ్వత్థామ రెడ్డి కాంగ్రెస్ కు  చెందిన నాయకుడు కాదని అన్నారు. ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడతామన్నారు. దేశం మొత్తం 51 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే సగం సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందన్నారు పొన్నం.