సీఎం కేసీఆర్ కు పొన్నం ప్రభాకర్ సవాల్

సీఎం కేసీఆర్ కు పొన్నం ప్రభాకర్ సవాల్

సీఎం కేసీఆర్ కుర్చీ వేసుకొని గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తానని ఇచ్చిన హామీ దశాబ్ద కాలం అయిన పూర్తి చేయలేదని ఎద్దేవ చేశారు  కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. జూన్ 28వ తేదీ బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గౌరవెల్లి ప్రాజెక్టులో నీళ్లు నింపుతామంటున్నారు, అసలు కాలువలు నిర్మించకుండా రైతుల పొలాలకు సాగు నీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారాయన. కాంగ్రెస్ పార్టీ హయాంలో, బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు పొన్నం ప్రభాకర్.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అటు ఎంపీగా ఐదు సంవత్సరాల కాలంలో, ఇటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా ఐదు సంవత్సరాల కాలంలో మొత్తం 10 సంవత్సరాల కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. తాను ఎంపీగా ఐదు సంవత్సరాల కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశానో చూపిస్తానని వ్యాఖ్యానించారు. ఇటీవల హుస్నాబాద్ కు వచ్చిన మంత్రి కేటీఆర్ తెలంగాణలో జరిగిన అభివృద్ధి, చత్తీస్గఢ్ లో జరిగిన అభివృద్ధిపై అక్కడికి వెళ్లి చూద్దామన్నారు, దానికి తాము సిద్ధమే అన్నారు పొన్నం ప్రభాకర్.