గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తా : పూజల హరికృష్ణ

గ్రామాభివృద్ధికి తోడ్పాటునందిస్తా  : పూజల హరికృష్ణ
  • కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ

సిద్దిపేట రూరల్, వెలుగు: కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించిన బచాయపల్లి గ్రామ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తానని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్​చార్జి పూజల హరికృష్ణ అన్నారు. సోమవారం రూరల్ మండలంలోని బచ్చాయిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన దుర్గం ప్రేమలత  సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో హరికృష్ణను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆమెను శాలువాతో సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ బచ్చాయి పల్లి గ్రామం నూతన పంచాయతీగా ఏర్పడిందని, ఆ గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా సహకరిస్తానని హామీ ఇచ్చారు.

ఏకగ్రీవ సర్పంచ్ కాంగ్రెస్ లో చేరిక

చిన్న కోడూరు మండలం రామంచ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన స్వతంత్ర సర్పంచ్ ఎర్ర భవాని నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్​చార్జి పూజల హరికృష్ణ ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధికి తీసుకుంటున్న విధానాల పట్ల విశ్వాసంతో కాంగ్రెస్ లో చేరుతున్నారన్నారు.

 సర్పంచ్ భవానీ మాట్లాడుతూ రామంచ గ్రామ అభివృద్ధి కోసం, ప్రజలకు మరింత దగ్గరగా పనిచేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు యాదగిరి, డీసీసీ మహిళా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, దాస అంజన్న, అర్బన్ మండల అధ్యక్షుడు భిక్షపతి యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోపి కృష్ణ పాల్గొన్నారు.