కేదార్‌నాథ్లో రాహుల్ గాంధీ.. మూడు రోజులు అక్కడే ధ్యానం

కేదార్‌నాథ్లో రాహుల్ గాంధీ.. మూడు రోజులు అక్కడే ధ్యానం

కాంగ్రెస్  ఎంపీ రాహుల్ గాంధీ  కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.    ఆయన 3 రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు.  అక్కడ ఓ గూహలో ధ్యానం చేస్తారని సమాచారం.  రాహుల్ గాంధీ కేదార్‌నాథ్‌లో మూడు రోజుల పాటు బస చేయడం ఇదే తొలిసారి.

రాహుల్  కోసం గర్వాల్ గెస్ట్ హౌస్ బుక్ చేయబడింది. ఇక్కడ పర్యటన అనంతరం రాహుల్ నేరుగా ఢిల్లీ్కి చేరుకుంటారు.  ఇది రాహుల్ వ్యక్తిగత పర్యటన అని దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.  ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర చివరి దశలో ఉంది.