ఖబడ్దార్.. కేసీఆర్కు రేణుకా చౌదరి వార్నింగ్

ఖబడ్దార్.. కేసీఆర్కు రేణుకా చౌదరి వార్నింగ్

సీఎం కేసీఆర్ పై  తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి.  ప్రవల్లిక ఆత్మహత్య  ప్రభుత్వ హత్యేనని.. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండాలంటూ కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ తన పార్టీ పేరు మార్చి తన జాతకం, గోత్రం మార్చుకున్నారని ధ్వజమెత్తారు.   మాటలకి జీఎస్టీ లేదు కాబట్టి కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అప్పులు చేసి తల్లిదండ్రులు పిల్లలను చదివిస్తున్నారన్నారు. కేసీఆర్ సొల్లు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 

Also Read :- దేశంలోనే చిన్న పోలింగ్ బూత్

ఐటీ కింగ్ అంటున్న కేటీఆర్.. పేపర్ల లీకేజీకి  బాధ్యత వహించాలన్నారు రేణుకా చౌదరి. బంగారు తెలంగాణ అంటూ పిల్లల బతుకులు ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. టీఎస్ పీఎస్ సీపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను పోలీసులు చావ బాదుతున్నారని.. ప్రజా రక్షకులుగా ఉండాల్సిన పోలీసులకు  మనసు లేదన్నారు. ప్రభుత్వానికి తొత్తులుగా ఉంటూ విద్యార్థులను కొడతారా అంటూ ప్రశ్నించారు.    తాము అధికారంలోకి రాగానే  టీఎస్ పీఎస్ సీ పై విచారణ జరిపిస్తామని చెప్పారు.