కాంగ్రెస్ లో మంత్రి పదవులపై లెక్కలేస్తున్న లీడర్లు

కాంగ్రెస్ లో మంత్రి పదవులపై లెక్కలేస్తున్న లీడర్లు

మనిషన్నాక ఆశావాదంతో ఉండాలని పెద్దలు చెబుతుంటారు. వెనకటికి ఒకాయన ఇదే మాట పట్టుకుని.. ఓ మామిడి మొక్క నాటాడు. దాని పక్కనే కూర్చున్నాడు. లెక్కలేయడం మొదలుపెట్టాడు. చెట్టుకు ఎన్ని కాయాలు కాస్తాయి..? వాటిని అమ్మితే ఎంతొస్తుంది..? వాటితో ఏమేం కొనుక్కోవాలని ఆలోచించుకుంటూ... ఆదమరిచి నిద్రపోయాడు. ఇదే టైంలో అటుగా వచ్చిన ఓ మేక.. ఆ మొక్కను తినేసి వెళ్లిపోయింది. ఏంటీ... ఈ మేక స్టోరీ ఎందుకు చెబుతున్నానని చూస్తున్నారా..? రాష్ట్రంలో.. దాదాపు ఈ కథలాంటి వ్యవహారమే నడుస్తోంది.