మంత్రి వివేక్ చొరవతో సమస్యల పరిష్కారం

మంత్రి వివేక్ చొరవతో సమస్యల పరిష్కారం

 డబుల్​ బెడ్రూం ఇండ్లలో సమస్యలు తెలుసుకున్న కాంగ్రెస్​ ప్రతినిధులు కోల్​బెల్ట్, వెలుగు: రాష్ట్ర కార్మిక, గనుల శాఖ వివేక్​ వెంకటస్వామి చొరవతో డబుల్​ బెడ్రూం ఇండ్లలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కాంగ్రెస్ లీడర్లు పేర్కొన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్​ఇండ్లను, లబ్దిదారుల సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ వొడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో లీడర్ల బృందం పర్యటించింది. డ్రైనేజీ, రోడ్ల సమస్య, తాగునీటి ఇబ్బందులు, స్ట్రీట్ లైట్ల ఏర్పాటు, చెట్ల పొదలు తొలగించడం, ప్రహరీ నిర్మాణం వంటి సమస్యలను లబ్ధిదారులు లీడర్లు దృష్టికి తీసుకెళ్లారు.

అనంతరం నేతలు మాట్లాడుతూ.. 2023లో చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామి ఎన్నికైన తర్వాత రూ.27 లక్షలతో కేటాయించి డబుల్​బెడ్రూం ఇండ్లకు రిపేర్లు చేసి అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేలా చొరవ చూపారని పేర్కొన్నారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ టౌన్​మాజీ ప్రెసిడెంట్​పల్లె రాజు, కౌన్సిలర్లు గుర్రం శ్రీనివాస్, పల్లె శ్రీదేవి, మాజీ జడ్పీటీసీ యాకుబ్​అలీ, మున్సిపల్​ మాజీ చైర్​పర్సన్ జంగం కళ, మాజీ వైస్ ​చైర్​పర్సన్ విద్యాసాగర్ ​రెడ్డి, స్థానిక లీడర్లు పాల్గొన్నారు.