
ఏ ఎన్నిక వచ్చినా గెలుపు టీఆర్ఎస్ దే అన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విపక్షాలకు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే కరువయ్యారని విమర్శించారు. కొత్తగా ఎన్నికైన ఛైర్మన్లు, మేయర్లు తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను కలిశారు. ఎన్నికల్లో డబ్బులు పంచారంటూ కాంగ్రెస్, బీజేపీలు ఓటర్లను అవమాన పరుస్తున్నాయన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడితే ఈవీఎంలే కారణమని ఆయా పార్టీల నాయకులు గొడవ చేశారని తెలిపారు. మరి ఇప్పుడు మున్సిపల్, పరిషత్ ఎన్నికల ఫలితాలపై ఏం చెబుతారని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందన్న ఆయన.. ఉత్తమ్ రాజకీయల నుంచి తప్పుకుంటే బెటరని సూచించారు.