
మహారాష్ట్రలో కాంగ్రెస్,మహా వికాస్ ఆఘాఢీ కూటమితో చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో, మిత్రపక్షాలు 39 స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్ట్‌ల్లో మూడింటిలో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్ సెంట్రల్‌తో సహా మహారాష్ట్రలోని 18 లోక్‌సభ స్థానాలకు ఉద్ధవ్ ఠాక్రే పోటీ చేయాలనుకుంటున్నారని సమాచారం. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. 2019లో లోక్ సభ ఎన్నికల కోసం ఉద్ధవ్ ఠాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ ల మహా వికాస్ అఘాడీ కోసం సీట్ల చర్చలు పూర్తిగా విఫలమయ్యాయి. అదే ఏడాది ఉద్ధవ్ ఠాక్రే శివసేన వర్గం మొత్తం 40 స్థానాల్లో పోటీ చేయగా.. 22 స్థానాల్లో గెలుపొందింది.
ఇక ఉత్తరప్రదేశ్‌లోని 80 పార్లమెంట్ సీట్లకు గానూ17 స్థానాలను సమాజ్‌వాదీ పార్టీ కాంగ్రెస్ కు ఆఫర్ చేసింది. ఢిల్లీలోని ఏడింటిలో మూడింటిలో కాంగ్రెస్ పోటీ చేస్తుండగా.. నాలుగింటిలో ఆప్ పోటీ చేయనుంది. అలాగే గుజరాత్‌లో రెండు చోట్ల ఆప్, చండీగఢ్‌లోని ఏకైక స్థానానికి కాంగ్రెస్, గోవాలోని రెండు సీట్లలో చెరోచోట పోటీకి అవకాశాలున్నాయి. ఇక బెంగాల్‌లోని 42 సీట్లు ఉండగా.. అందులో ఆరు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాలని భావిస్తోంది. కాగా.. ఐదు సీట్ల వరకు పోటీ చేసేందుకు మమతా అంగీకారం తెలిపింది.