స్పీకర్‌పై పేపర్లు విసిరిన విపక్ష ఎంపీలు.. ఎనిమిది మంది ఎంపీలు సస్పెండ్‌

స్పీకర్‌పై పేపర్లు విసిరిన విపక్ష ఎంపీలు.. ఎనిమిది మంది ఎంపీలు సస్పెండ్‌

ఢిల్లీ: లోక్ సభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ ముందున్న టేబుల్ ఎక్కి ఎంపీలు నిరసన తెలిపారు. స్పీకర్ పైకి విపక్ష ఎంపీలు పేపర్లు విసరడంతో రచ్చరచ్చ అయింది. పేపర్లు విసిరిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలను ఈ సెషన్ ముగిసేవరకూ లోక్ సభ సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో తెలంగాణ ఎంపీ చామల కూడా ఉన్నారు. 

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన బుక్పై లోక్ సభలో మంగళవారం కూడా వివాదం నడిచింది. లడఖ్ సరిహద్దు వివాదంపై భారత మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం.నరవణె రాసిన (ప్రచురితం కాని) పుస్తకం పార్లమెంట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. 

నరవణె రాసిన బుక్పై సంభాషణను ప్రారంభించడానికి రాహుల్ గాంధీ మంగళవారం కూడా సభలో పదే పదే ప్రయత్నించగా స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో.. విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్యానెల్ స్పీకర్ పైకి విపక్ష ఎంపీలు పేపర్లు విసరడంతో దుమారం రేగింది. 

Also Read : పౌరుల ప్రైవసీతో ఆటలాడితే దేశం విడిచి పోవాల్సి వస్తది

గుర్జీత్‌ సింగ్‌, హిబీ ఈడెన్‌, అమరీందర్‌ సింగ్‌, రాజా వారింగ్‌, మాణికం ఠాగూర్‌, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సస్పెండ్‌ అయిన ఎంపీల్లో ఉన్నారు. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య లోక్‌సభ బుధవారానికి వాయిదా పడింది.