రియల్ ఎస్టేట్ బ్రోచర్లా కాంగ్రెస్ డిక్లరేషన్

రియల్ ఎస్టేట్ బ్రోచర్లా  కాంగ్రెస్ డిక్లరేషన్

నిజామాబాద్: కాంగ్రెస్ అంటే కరప్షన్ ఫ్రీ కాదని... కరప్షన్ ట్రీ అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సెటైర్లు వేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... రైతుల కోసం వచ్చి ఏం మాట్లాడాలని రాహుల్ గాంధీ అడగడాన్ని బట్టే రైతుల పట్ల ఆయన చిత్తశుద్ది ఏపాటిదే అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని రాహుల్ చెప్పారన్న ఆయన.. పెట్టుబడి సాయాన్ని దేశం మొత్తం ఇస్తారా అని నిలదీశారు. ఎంఎస్పీ అనేది కేంద్రం పరిధిలోని అంశమని, అలాంటప్పుడు రాహుల్ మద్ధతు ధర ఏ విధంగా ఇస్తారని అడిగారు. తమ 70 ఏళ్ల పాలనలో చెరుకు, పసుపు రైతులకు తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్... చెరుకు పరిశ్రమ, పసుపు బోర్డు పేరుతో డ్రామాలాడుతోందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్న ఆయన... యూపీఏ హయాంలో ఉపాధి హామీకి వ్యవసాయాన్ని ఎందుకు అనుసంధానం చేయలేదని ప్రశ్నించారు. వరంగల్ సభలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన డిక్లరేషన్ రియల్ ఎస్టేట్ బ్రోచర్ లా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే ధరణిలో ఏమైనా తప్పులు ఉంటే సరి చేయాలి గానీ మొత్తం ధరణి పోర్టల్ నే రద్దు చేస్తామనడం కాంగ్రెస్ నాయకుల అవగాహన రాహిత్యానికి నిదర్శమన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

రాహుల్ వయనాడ్ లో ఓడిపోవడం ఖాయం

ముగిసిన రాహుల్ గాంధీ పర్యటన