టీడీపీ సంబురాల్లో కాంగ్రెస్ మంత్రి తుమ్మల !

టీడీపీ సంబురాల్లో కాంగ్రెస్ మంత్రి తుమ్మల !

ఖమ్మం టౌన్, వెలుగు :  ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావడంతో ఖమ్మంలో టీడీపీ, జనసేన పార్టీలు సంబురాలు నిర్వహించుకున్నాయి. దీనికి అనూహ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ జిల్లా ఆఫీసులోకి వెళ్లిన మంత్రి ఎన్టీఆర్  విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు మంత్రికి తెలుగు తమ్ముళ్లు ఘన స్వాగతం పలికారు. మరోవైపు ఖమ్మం లోక్ సభ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి గెలవడంతో ఆయన క్యాంపు ఆఫీసుకు వెళ్లి సన్మానించారు.