మంచిబట్టలు వేసుకుంటే..కడియం కిందమీద చూస్తడు

మంచిబట్టలు వేసుకుంటే..కడియం కిందమీద చూస్తడు

బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరిపై  తీవ్ర విమర్శలు చేశారు  కాంగ్రెస్ అభ్యర్థి ఇందిర.  స్టేషన్ ఘన్ పూర్ లో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో మాట్లాడారు ఆమె..  దళితులంటే కడియం శ్రీహరికి చిన్నచూపని.. తెల్లబట్టలు వేసుకుంటే మనుషులను కిందికి మీదికి చూస్తారని వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తికి మర్యాద కూడా ఇవ్వడం తెల్వదన్నారు. సీఎం దళిత ద్రోహి.. అని దళితుల పేరు చెప్పి ఓట్లు వేసుకుని మోసం చేశారని మండిపడ్డారు.  దళితుల ఓట్లు లేకుండా కేసీఆర్ గెలవలేరన్నారు.  కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ఐకేపీ సెంటర్లో వడ్లు ఆరబెట్టడానికి కూడా స్థలం ఉండదన్నారు. ఇప్పటికే హైదరాబాద్  చుట్టుపక్కల అన్ని భూములను కేసీఆర్ ఆక్రమించుకున్నారని ఆరోపించారు. 

రాజయ్యనా..? లేక కృష్ణయ్యనా

స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య లాంటి వాళ్లు ఆడవాళ్ల విషయంలో మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడాలని, వారి గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు రేవంత్ రెడ్డి. ఒకవేళ గౌరవం నిలబెట్టుకోలేకపోలే ప్రజలు కర్రకాల్చి వాత పెడుతారని హెచ్చరించారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కడియం, రాజయ్య చేసిందేమీ లేదన్నారు. కడియం సంగతి రాజయ్య చెప్పాడు.. రాజయ్య సంగతి కడియం ఇప్పటికే చెప్పాడు.. ఎవరు ఎలాంటి వాళ్లు తాము చెప్పాల్సిన పని లేదు అని అన్నారు. ఆయన రాజయ్యనా..? లేక కృష్ణయ్యనా... ఆ విషయం తనకు తెలియదన్నారు.