
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి జగన్ మోహన్ రెడ్డి, ఫడ్నవిస్ లను పిలిస్తే తప్పేంటని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైతే తమ నియోజకవర్గంలో ప్రజల సాగునీరు, తాగునీరు సమస్యలు తీరుతాయని ఆయన అన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని తప్పు పట్టాల్సి న అవసరం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అయితే సింగూర్, మంజీర డ్యామ్ లు నింపుతామని సీఎం కేసీఆర్ చెప్పారని, మంచి పనిని ఎవరైనా స్వాగతించాలని జగ్గారెడ్డి అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు లో కాంగ్రెస్ భాగస్వామ్యం కూడా ఉందన్నారు జగ్గారెడ్డి. తెలంగాణ ఇచ్చింది రాహుల్ గాంధీ, సోనియాగాంధీ కాబట్టి అందులో మా భాగస్వామ్యం కూడా ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తన జిల్లాకు సంబంధించిన విషయం కాబట్టి కేవలం ప్రాజెక్టు వల్ల పొందే ఉపయోగాలనే మాట్లాడుతున్నానని…కాళేశ్వరం అవినీతి గురించి మా సీఎల్పీ మాట్లాడుతారని జగ్గారెడ్డి అన్నారు.