
కాంగ్రెస్ ను వీడుతున్నట్టు ఆ పార్టీ ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియా నాయక్ ఆదివారం ప్రకటించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ పడుతున్న తపనను చూసి టీఆర్ ఎస్ లో చేరుతున్నట్టు వెల్లడించారు. ఇల్లెందు ప్రాంత అభివృద్ధి కోసం, ఎన్నికల్లో తనను గెలిపించి న ప్రజల రుణం తీర్చు కోవడం కోసం కేసీఆర్ బాటలో పయనించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ తరఫున పోటీకి సిద్ధమని ప్రకటించారు.