- కేటీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ మండలంలో కేవలం నాలుగైదు పంచాయతీ సర్పంచ్ లను గెలిపించుకున్న కేటీఆర్ ఏదో సాధించినట్టు ఒక్కటే హడావుడి చేస్తున్నడని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. మంగళవారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లో 20 ఏండ్ల నుంచి కొనసాగుతున్న కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉండి, నలుగురు సర్పంచ్లను గెలిపించుకొని హడావుడి చేస్తున్న తీరు సిగ్గుపడేలా ఉందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరుతో కారు పార్టీలో కంగారు మొదలైందని చెప్పారు. పదేండ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీ కనీసం 30 శాతం కూడా సర్పంచ్లను గెలిపించుకోలేదని విమర్శించారు.
