
- కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: కవిత తన రాజకీయ జీవితం కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని, ఆమె మాయలో నిరుద్యోగులు పడొద్దని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కోరారు. ఆమె ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద కాకుండా కేసీఆర్ ఫామ్ హౌజ్ ముందు వంటా వార్పు ప్రోగ్రామ్ చేస్తే నిరుద్యోగులు హర్షిస్తారని సూచించారు. శుక్రవారం ఆయన సీఎల్పీలో మీడియాతో మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని..అప్పుడు కవిత ఎటుపోయారని ప్రశ్నించారు. .
తమ ప్రభుత్వం ఇప్పటికే 60 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసిందని, ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ శాఖల్లో నోటిఫికేషన్లు కూడా వచ్చాయని గుర్తుచేశారు. రానున్న రోజుల్లో మరికొన్ని శాఖల నుంచి నోటిఫికేషన్లు రానున్నాయని చెప్పారు. నిరుద్యోగులు రాజకీయ కుట్రలకు దూరంగా ఉండాలని, పరీక్షల కోసం సన్నద్ధం కావాలని వెంకట్ సూచించారు.