మద్యం దుకాణాలు, సినిమా హాళ్లు వెంటనే బంద్ చేయాలి

మద్యం దుకాణాలు, సినిమా హాళ్లు వెంటనే బంద్ చేయాలి
  • కరోనా సెకండ్ వేవ్ కేసులు కనిపించడం లేదా..?
  • రాజ్యాంగబద్ద పాలన జరగడం లేదని మంత్రే అంటుంటే ఇక దిక్కెవరు
  • సర్కార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధ్వజం

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మళ్లీ విస్తరిస్తుంటే పట్టించుకునే నాథుడే కనిపించడం లేదని.. విద్యా సంస్థల బంద్ కాదు.. ముందు మద్యం దుకాణాలు.. సినిమా హాళ్లు వెంటనే బంద్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.  అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా వైరస్ తీవ్రంగా విస్తరిస్తోందని.. సెకండ్ వేవ్ లో రోజుకు వెయ్యి కేసులు నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘రాబోయే రోజుల్లో పతాక స్థాయిలో కేసులు నమోదవుతాయని తెలుస్తున్నా.. జనసముహాన్ని నివారించలేకపోతున్నారని చెప్పారు. విద్యాసంస్థలు మూసేశారు.. బాగానే వుంది.. సినిమా హాల్స్, వైన్ షాపులు ఎందుకు మూసివేయడం లేదు..? సినిమా నిర్మాతలకు ఇబ్బంది కలగకుండా సర్కార్ సపోర్ట్ చేస్తున్నట్లుంది.. మద్యం దుకాణాల వద్ద.. విచ్చల విడిగా జనం వుంటున్నారు.. ఆదాయ మార్గాలుగా వున్న మద్యం షాపులపై చర్యలు తీసుకోవడంలేదనిపిస్తుంది.. ’’అని జీవన్ రెడ్డి అన్నారు. ‘‘కరోనా వైరస్ సెకండ్ వేవ్ మహారాష్ట్ర నుండి విస్తరిస్తోంది.. అక్కడ ట్రేసింగ్ టెస్టింగ్ లేదు.. మహారాష్ట్ర నుండి తెలంగాణకు రాకపోకలను నిలిపివేయడం లేదు.. ఆయుష్ మాన్ భారత్.. అమలు అవుతుందా లేదా..? కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడానికి ఎందుకు వెనుకాడుతున్నారు..?  ఆయుష్ మాన్ భారతి, ఆరోగ్య శ్రీ లేక ప్రజలు పరేషాన్ అవుతున్నారు..  ప్రైవేట్ హాస్పిటళ్ల దోపిడీకి రోగులు.. సర్వం కోల్పోతున్నారు.. ఫీజుల నియంత్రణ కూడా ఎక్కడా అమలు కావడం లేదు.. మంత్రి ఈటెల కూడా సరిగ్గా పట్టించుకోవడం లేదు.. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన జరగడం లేదని మంత్రి ఈటెల అన్నాడంటే..రాష్ట్రంలో పాలన ఏవిధంగా వుందో అర్ధం చేసుకోవచ్చు..ఉద్యోగాల భర్తీలో సర్కార్ నిర్లక్ష్యం గా వ్యవహరిస్తోంది..సునీల్ మరణానికి సర్కారే కారణం.. బడ్జెట్ లో వైద్యసేవలకు 4.2 శాతం కేటాయించడం దారుణం.. ఇతర రాష్ట్రాల్లో మనకంటే అదనంగానే కేటాయింపులు వున్నాయి..ఢిల్లీ 12.5, అస్సాం 6 శాతం కేటాయించాయి..సినిమా హాల్స్ ను తాత్కాలికంగా మూసివేయాలి.. మద్యం షాపులు కూడా మూసివేయాలి.. కరోనా సోకినా రోగులకు ఉచిత వైద్య సేవలు అందించాలి..’’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.