కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్

కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్

న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ సర్కారు సాధారణ ప్రజలపైనే పన్నుల భారం ఎక్కువగా మోపుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇన్నేండ్లలో తన దోస్తులైన బడా వ్యాపారవేత్తలకు పన్ను లు తగ్గించారని, జనాలపై ఎక్కువ వేశా రని ఆదివారం ట్వీట్ చేశారు. కొన్నేండ్లు గా కార్పొరేట్లపై విధించే పన్నులు తగ్గుతున్నాయని, ప్రజలపై వేసే ట్యాక్స్​ల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయ శాతం పెరిగిందని చెప్పారు.

దీనికి సంబంధిం చిన గ్రాఫ్​ను ఆయన షేర్ చేశారు. ‘‘ప్రజలపై పన్నులు పెంచుడు, మిత్రులకు తగ్గించుడు ఈ సర్కారు కు అలవాటైన పనే” అని రాహుల్ పేర్కొన్నారు. 2010లో ప్రజలపై పన్నుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 24% ఆదాయం రాగా కార్పొరేట్లపై వచ్చింది 40%. 2021లో ప్రజలపై పన్నుల ద్వారా 48%, కార్పొరేట్లపై 24% ఆదాయం వచ్చిందని గ్రాఫ్​లో చూపించారు.