రాహుల్​గాందీకి ఊమెన్ చాందీ అవార్డు

రాహుల్​గాందీకి ఊమెన్ చాందీ అవార్డు

న్యూఢిల్లీ: ఊమెన్ చాందీ పబ్లిక్ సర్వెంట్ అవార్డుకు కాంగ్రెస్ ఎంపీ, లోక్​సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎంపికయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత, కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీ స్మారకార్థం ఈ అవార్డును ఊమెన్ చాందీ ఫౌండేషన్ ఆదివారం ప్రకటించింది. ఈ అవార్డు కింద రూ.1 లక్షతో పాటు ప్రముఖ కళాకారుడు, నిర్మాత పుష్పరాజ్ రూపొందించిన శిల్పాన్ని అందజేయనున్నారు.

భారత్ జోడో యాత్ర ద్వారా దేశవ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు రాహుల్ ప్రయత్నించారని, అందుకే ఆయనను అవార్డుకు ఎంపిక చేసినట్లు జ్యూరీ ప్రకటించింది. జ్యూరీకి అధ్యక్షుడిగా ఎంపీ శశిథరూర్ ఉన్నారు.