
రంగారెడ్డి జిల్లా జన్వాడ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి కేటీఆర్ అక్రమంగా జన్వాడలో ఫామ్ హౌస్ నిర్మించారని ఆరోపిస్తూ.. దాన్ని బయటపెడతానంటూ మీడియాను తీసుకెళ్లిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు అక్కడికి వెళ్లిన మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో రేవంత్ రెడ్డికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
గండిపేట చెరువుకు వెళ్లే దారిలో కేటీఆర్ విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాంతం 111 జీవో పరిధిలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి 25 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణం చేపట్టారని అన్నారు.