వెంచర్లు, లే అవుట్లు వేస్తే సైదిరెడ్డికి 10 శాతం వాటా ఇవ్వాల్సిందే

వెంచర్లు, లే అవుట్లు వేస్తే సైదిరెడ్డికి 10 శాతం వాటా ఇవ్వాల్సిందే

ఎంపీ సంతోష్ కుమార్ ప్రోద్బలంతో హుజూర్ నగర్ లో ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.నియోజకవర్గంలో  ఎమ్మెల్యే సైదిరెడ్డి100 ఎకరాల భూమి కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. తన సుదీర్థ రాజకీయ చరిత్రలో ఇలాంటి అవినీతి ఎమ్మెల్యేను ఎక్కడా చూడలేదన్నారు.  హుజూర్ నగర్ మున్సిపాలిటీ లో వెంచర్లు, లే అవుట్లు చేసి 10 శాతం మున్సిపాలిటీకి ఇవ్వకుండా ఎమ్మెల్యేకు వాటా ఇస్తున్నారన్నారు. ఇందులో హుజూర్ నగర్ ఎమ్మార్వో పాత్ర కీలకంగా మారిందని..వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని సూచించారు. 

సైదిరెడ్డి కెనడాలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీకి, మున్సిపాలిటీలకు కొన్ని వందల ఎకరాలు ఉండేవి. వాటి జోలికి ఎవరూ వెళ్లేవారు కాదు. కానీ సైదిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ భూములన్నీ కబ్జాకు గురవుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.  సూర్యాపేట జిల్లా కలెక్టరెట్ పూర్తి చేయకుండా ఎంపీ సంతోష్ ప్రమేయంతో ఎమ్మెల్యే సైదిరెడ్డికి ఏడాదికి కోటి రూపాయలు ఇస్తున్నారని ఆరోపించారు.  నాలుగైదు ఏండ్ల నుంచి కొత్త కలెక్టరేట్ కట్టకుండా  ఆలస్యం చేస్తున్నారన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైస్ రాజశేఖర్ రెడ్డి 13 వ వర్ధంతి సందర్భంగా హుజూర్ నగర్  కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన  చిత్రపటానికి పూలమాల వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాళులర్పించారు.