90% మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలవాల్సిందే.. సర్వే రిపోర్టుల ప్రకారమే బీ ఫాంలు: సీఎం రేవంత్‌‌రెడ్డి

90% మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలవాల్సిందే.. సర్వే రిపోర్టుల ప్రకారమే బీ ఫాంలు: సీఎం రేవంత్‌‌రెడ్డి
  • రెబల్స్​ బరిలో ఉండకుండా చూడాలి
  •     బీసీల్లో అన్ని సామాజికవర్గాలకు న్యాయం జరగాలి
  •     ఆ 10 నియోజకవర్గాల్లో కొత్త, పాత నేతల మధ్య సమన్వయం చేసుకోవాలి
  •     జూమ్​ మీటింగ్‌‌లో మంత్రులు, పార్టీ నేతలకు సీఎం దిశా నిర్దేశం
  •     పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు
  • ఫిబ్రవరి 4 నుంచి సీఎం  మున్సిపల్ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 90 శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్​ గెలవాల్సిందేనని మంత్రులు, పార్టీ ముఖ్య నేతలకు  సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంచేశారు. అన్నిచోట్ల కాంగ్రెస్​పార్టీ నుంచే నలుగురు, ఐదుగురు నామినేషన్​ వేసినట్లు తనకు సమాచారం ఉందని, అందులో సర్వే ఆధారంగా ఒకరికి బీ ఫాం ఇచ్చి, మిగిలిన వారిని పోటీ నుంచి తప్పించేలా చూడాలన్నారు. ఏ ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ రెబల్స్ బరిలో ఉండడానికి వీల్లేదని, ఇది పార్టీ గెలుపోటములపై ప్రభావం చూపుతుందని  పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌‌రెడ్డి శనివారం జూమ్‌‌లో పార్టీ నేతలకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.  సమావేశంలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు, డీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..   బీ ఫాం రాని ఆశావహులను బుజ్జగించి వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని భరోసా ఇచ్చి.. పోటీ నుంచి తప్పించాలని  మంత్రులు, డీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సూచించారు. ఈ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతల కుటుంబ సభ్యులు పోటీకి దూరంగా ఉండేలా చూడాలని, ఒకవేళ తప్పని పరిస్థితుల్లో పోటీ చేయాల్సి వస్తే హైకమాండ్ అనుమతి తప్పనిసరి  తీసుకోవాలని ఆదేశించారు. 

మేయర్, చైర్మన్ పదవులపై ఇప్పుడే ఏ నాయకుడు కూడా మాట ఇవ్వద్దని, అప్పటి పరిస్థితులు, సామాజిక సమీకరణాలను బట్టి  నిర్ణయిద్దామని తెలిపారు.  బీసీల్లో ఒకటి, రెండు  కులాలకే ఎక్కువ టికెట్లు దక్కకుండా జాగ్రత్తపడాలని, బీసీల్లో కూడా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగేలా టికెట్ల కేటాయింపు ఉండాలని సూచించారు. సామాజిక సమీకరణకు  అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మహిళలు, మైనార్టీలను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంచేశారు. 

సర్వే రిపోర్టుల ప్రకారం..

ఇప్పటికే అందిన సర్వే రిపోర్టులను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులకు బీఫాంలు ఇవ్వాలని, గెలిచే అవకాశం ఉన్న వారినే బరిలో నిలపాలని సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి సూచించారు. బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ బలంగా ఉన్నచోట మంత్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అక్కడ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సానుకూల వాతావరణం ఏర్పడే వరకు శ్రమించాలన్నారు. ఆ 10 నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతలను  సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని చెప్పారు.  రెండు వర్గాలు పార్టీకి ముఖ్యమేనని స్పష్టంచేశారు. జగిత్యాల, పటాన్ చెరులాంటి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టి పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చేలా చూడాలన్నారు. ఎన్నికల ప్రచార వ్యూహంలో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు కూడా రానున్నారని తెలిపారు. 

మూడు రోజుల్లో సీఎం ప్రచారం షురూ..

ఫిబ్రవరి 4 వ తేదీ నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తాను పాల్గొంటానని మంత్రులకు సీఎం రేవంత్‌‌రెడ్డి   చెప్పారు.  4 న నల్గొండ జిల్లా మిర్యాలగూడలో, 5న  కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, 6 న నిజామాబాద్ రూరల్‌‌లో, 7 న రంగారెడ్డి జిల్లా పరిగిలో, 8 న వరంగల్ జిల్లా భూపాలపల్లిలో, 9 న మెదక్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లు చేసుకోవాలని  మంత్రులు, డీసీసీ చీఫ్‌‌లకు సూచించారు.