రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈనెల 16వ తేదీన హైదరాబాద్ లో చేపట్టబోయే పాదయాత్ర వాయిదా పడినట్టు తెలిపారు ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి ఆర్.సి కుంతియా. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ, ఈ నెల 16వ తేదీన గాంధీభవన్ నుంచి హైద్రాబాద్ కలెక్టరేట్ వరకు చేపట్టిన రాష్ట్ర స్థాయి పాదయాత్ర కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు ఆయన తెలిపారు. 16వ తేదీన ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు. మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తామని త్వరలో ప్రకటన చేస్తామని అన్నారు.
