కేసీఆర్ చేతిలో తెలంగాణ విలవిల్లాడుతోంది.. రాష్ట్రాన్ని మీరే కాపాడాలి తల్లి

కేసీఆర్ చేతిలో తెలంగాణ విలవిల్లాడుతోంది.. రాష్ట్రాన్ని మీరే కాపాడాలి తల్లి

సీఎం కేసీఆర్ చేతిలో తెలంగాణ విలవిల్లాడుతోంది..మీరే రాష్ట్రాన్ని కాపాడాలి తల్లి అంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియాగాంధీని కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియా గాంధీతో వీడియో కాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ  4 కోట్ల ప్రజల చిరకాల కోరికను మీరు నిజం చేశారు. విద్యార్థుల ఆత్మ బలిదానాలు చూడలేక తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఇచ్చారు. మిగులు బడ్జెట్ తో మీరు ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు కేసీఆర్. కేసీఆర్ నిరంకుశ పాలనతో రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పుల ఊబిలో నెట్టారు. కరోనా విషయంలో నిమ్మకు నిరెత్తనట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  మీరు ఇచ్చిన తెలంగాణ కేసీఆర్ చేతిలో విలవిల్లాడుతోంది. మీరే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి. రాష్ట్రంలో కరోనా టెస్టులు చేయడంలేదు. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  తెలంగాణ ఇచ్చిన తల్లిగా ఈ రాష్ట్రాన్ని మీరే కాపాడండి అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోనియా గాంధీని కోరారు.