కేసీఆర్ దత్తత గ్రామంలో కాంగ్రెస్ రచ్చబండ.. నేతల అరెస్టు

కేసీఆర్ దత్తత గ్రామంలో కాంగ్రెస్ రచ్చబండ.. నేతల అరెస్టు

కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవెల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. ఇప్పటికే రేవంత్ ఇంటిని చుట్టుముట్టారు పోలీసులు. రచ్చబండకు వెళ్తున్న పలువురి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. రచ్చబండ కార్యక్రమానికి జగిత్యాల నుంచి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని అడ్డుకుని గృహ నిర్భంధం చేశారు పోలీసులు.