కాంగ్రెస్ పాంచ్ న్యాయ్..పచ్చీస్ గ్యారంటీలు

కాంగ్రెస్ పాంచ్ న్యాయ్..పచ్చీస్ గ్యారంటీలు

కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల  మేనిపేస్టో రిలీజ్ చేసింది.  పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీలతో మేనిఫేస్టో రీలీజ్ చేశారు.  సామాజిక సంక్షేమ పథకాలతో పాటు పాటు 25 హామీలు పొందుపరిచారు.  ఏఐసీసీ కార్యాలంలో కాంగ్రెస్ చీఫ్  మల్లికార్జున ఖర్గే 48 పేజీల మేనిఫేస్టో రిలీజ్ చేశారు. 

ఈ కార్యక్రమానికి ఖర్గే,  రాహుల్ గాంధీ, సోనియా,  చిదంబరం, కాంగ్రెస్  ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడిన చిదంబరం..ఎన్నో కసరత్తులు చేసిన తర్వాత మేనిఫేస్టో రిలీజ్ చేశామన్నారు.   దేశ వ్యాప్తంగా కులగణణ చేస్తామని చెప్పారు. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తామని తెలిపారు. పెట్రోల్ డీజిల్ రేట్లను తగ్గిస్తామన్నారు. రైల్వేలో ప్రైవేటీకరణ నిలిపివేస్తామని చెప్పారు. 

ఐదేళ్లుగా వేతనాలు పెరగలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషర్లు కల్పిస్తామని వెల్లడించారు .  వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపునిస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో 7.8వృద్దిరేటు ఉండేదని..గత పదేళ్లలో 5.8 మించడం లేదన్నారు. మోదీ ప్రభుత్వం సంపన్నుల కోసమే పనిచేస్తుందని విమర్శించారు 

చిదంబరం కామెంట్స్

  • డ్రాఫ్ట్ మేనిఫెస్టోను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించాం
  • సభ్యుల సూచనలు తీసుకుని తుది మేనిఫెస్టో రూపొందించాం
  • గత పదేళ్ల కాలంలో విధ్వంసానికి గురైన వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని తయారు చేశాం
  • 2019లో మేము ఊహించిందే జరిగింది. వ్యవస్థలను నిర్వీర్యం చేయడమో.. లేదా క్యాప్చర్ చేయడమో జరిగింది
  • బలహీన వర్గాల హక్కులు కాలరాశారు
  • నియంతృత్వం, నిరంకుశ విధానాలు అమలవుతున్నాయి
  • ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దేలా మేనిఫెస్టో ఉంది
  • వర్క్, వెల్త్, వెల్ఫేర్ మూల సూత్రాలుగా మేనిఫెస్టో
  • వర్క్   అంటే ఉద్యోగ కల్పన. ఐఎల్ఓ నివేదిక ప్రకారం దేశంలో నిరుద్యోగ రేటు అత్యంత దారుణంగా ఉంది
  • ఐఐటీ నుంచి వచ్చిన 30% మంది నిపుణులు కూడా నిరుద్యోగులుగా మిలిగిపోతున్నారని రిపోర్ట్స్ ఉన్నాయి
  • వెల్త్ - సంపదను పంచిపెట్టే ముందు దాన్ని సృష్టించాలి. దేశంలో 50% మంది ప్రజల ఆదాయంలో మార్పు లేకపోవడమో.. లేదంటే తగ్గడమో జరిగింది
  • యూపీఏ హయాంలో 7.5% నికరంగా వృద్ధి రేటు కొనసాగించాం
  • గత పదేళ్లలో సగటు వృద్ధి రేటు 5.8% మాత్రమే
  • ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 1.6%. ఇంత పెద్ద దేశానికి ఇదేమీ చిన్న సంఖ్య కాదు
  • ప్రభుత్వ, ప్రైవేట్, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించేలా మా పాలసీలు ఉంటాయి
  • యూపీఏ ప్రభుత్వం తరహాలో అధిక వృద్ధి రేటుతో ముందుకెళ్తాం
  • వెల్ఫేర్ - ఈ ప్రభుత్వం ఎవరికి సంక్షేమం అందిస్తోంది? ఈ ప్రభుత్వం ధనిక వర్గం కోసమే ఉంది. వారి కోసమే పనిచేస్తోంది.
  • యూపీఏ ప్రభుత్వం 23 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసింది
  • రానున్న పదేళ్లలో మరో 23 కోట్ల మందిని మేము పేదరికం నుంచి బయటపడేస్తాం
  • మేము గతంలో చేశాం. ఇప్పుడు చేసి చూపిస్తాం అని చెబుతున్నాం
  • ప్రజలు ఈ మేనిఫెస్టోను పూర్తిగా అర్థం చేసుకుని చేతి గుర్తుకు, మా మిత్రపక్షాల గుర్తులకు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను

మేనిఫేస్టోలో కీలక అంశాలు

  • యువతకు 30 లక్షల ఉద్యోగాలు
  • అగ్నీవీర్ స్కీమ్ రద్దు..పాతపద్దతిలోనే ఆర్మీ రిక్రూట్ మెంట్
  •  దేశ వ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ
  •  దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ
  • పెగాసస్, రాఫెల్ పై విచారణ
  • ఎలక్టోరల్ బాండ్లపై విచారణ 
  • 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత
  • కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్
  • పెట్రోలో డీజిల్ రేట్లు తగ్గింపు
  •  కనీస మద్ధతు ధరకు చట్టబద్ధత
  •  వ్యవసాయ పరికారలకు జీఎస్టీ రద్దు
  •   ఉపాధీ హామీ పథకం కింద రోజుకు రూ. 400 వేతనం
  • రైల్వే ఛార్జీల తగ్గింపు, వృద్ధులకు  టికెట్లలో రాయితీ
  • మహాలక్ష్మీ స్కీం కింద ఏడాదికి లక్ష
  • దేశ వ్యాప్తంగా కలగణన
  • రైల్వేల ప్రైవేటీకరణ నిలిపివేత
  •  విద్యార్థులకు లక్ష సాయం