ఒక్కొక్కటిగా అన్ని సంస్థలనూ నాశనం చేస్తున్రు

ఒక్కొక్కటిగా అన్ని సంస్థలనూ నాశనం చేస్తున్రు

న్యూఢిల్లీ: రాజ్యాంగం ద్వారా ఏర్పాటై న సంస్థలను ఒక్కొక్కటిగా మోడీ సర్కారు నాశనం చేస్తోందని కాంగ్రెస్​ ఎంపీ రాహుల్  గాంధీ మండిపడ్డారు. యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్ (యూపీఎస్సీ)​కి కొత్త చైర్మన్​ నియామకంపై ఆయన ఈ కామెంట్స్ చేశారు. తమ పార్టీతో, రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో సంబంధాలు ఉన్న మనోజ్​ సోనిని ప్రభుత్వం యూపీఎస్సీ చైర్మన్​గా నియమించింది. దీనిని రాహుల్​ గాంధీ తప్పుబట్టారు. శాసనాల అమలులో కీలకమైన యూపీపీఎస్సీ వంటి సంస్థలలో తమ కు నచ్చిన వాళ్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం వాటిని నాశనం చేస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగం అమలుకు ఈ సంస్థలే కీలకమని, వీటిని ఒక్కొక్క టిగా నాశనం చేస్తూ మోడీ సర్కారు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. ఈమేరకు మనోజ్​ సోనీకి ఆర్ఎస్ఎస్, బీజేపీతో అనుబంధం ఉందన్న మీడియా రిపోర్టుతో సహా రాహుల్​ ఈ ట్వీట్​ చేశారు.